వైసీపీ ఎమ్మేల్యేలుతో సిఎం జగన్‌మ్మోహన్‌రెడ్డి సమావేశం
అమరావతి: ఈనెల 19న వైసీపీ శాసనసభ్యులుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు.అసెంబ్లీతరువాత అందరితో భేటీ నిర్వహించనున్నారు.175నియెజకవర్గాలు ఎమ్మేల్యేలు సమన్వయకర్తలు పనితీరు నివేదికలు అందిన తరుణంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాదాన్యత సంతరించుకుంది.పికే టీం నివేదిక ప్రకారం ఇటీవల కొందరి మంత్రులు పై జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది.రాబోయే ఎన్నికలలో కొందరికి టిక్కెట్లుకూడా ఇచ్చే పరిస్దితి లేదని వార్తలు రావడంతో శాసనసభ్యులులో ఉత్కంఠ నెలకుంది.మరి సమావేశం అనంతరం ఏమి మార్పులు చేర్పులు జరుగుతాయే వేచి చూడాలి.