శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం`జిల్లా విద్యాశాఖాదికారి
శ్రీకాకుళం రూరల్: ఉత్తమఫలితాలు సాధనకు ,శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అటు ఉపాద్యాయులు,ఇటు తల్లిదండ్రులు కృషి కూడా ముఖ్యమని శ్రీకాకుళం జిల్లావిద్యాశాఖాదికారి గార పగడాలమ్మ అన్నారు.శ్రీకాకుళం రూరల్‌మండలం ఇప్పిలి గ్రామంలో ఇంటింటికి వెల్లి విద్యార్దులు విద్యావిధానంఎలా వుందో స్వయంగా తెలుసుకున్నారు.పాఠశాలలో ఉత్తమ విద్యను అందించడం జరుగుతుందని ,అయితే విద్యార్దులుకూడా నిరంతర కృషి చేసి కష్టపడి చదువుకోవాలని అలాంటప్పుడే తల్లిదండ్రులుకు ఉపాద్యాయులకు మంచిపేర వారు చేసే కృషికి ఫలితం కలుగుతుందని అన్నారు.ఇప్పటికే ప్రయివేటు పాఠశాలకు ధీటుగా మంచి ఫలితాలు ఎక్కువ శాతం శతశాతం ఉత్తీర్ణత సాదించగలుగుతున్నామని అన్నారు.విద్యార్దులు కృషి మరింత అవసరమని నేరుగా గ్రామాలలో పరిశీలించి వారి తల్లిదండ్రులుతో మమేకమైతే పూర్తి అవగాహన వస్తుందని డిఇఓ తెలిపారు.జిల్లావ్యాప్తంగా అన్నిపాఠశాల పరిదిలో ఆయా పాఠశాలలు ఉపాద్యాయులు,సంబందిత అదికార్లుకూడా గ్రామాలలోసందర్శంచి విషయం తెలుసుకుంటున్నారని ,ఇప్పలి ప్రాధమిక ఉన్నత పాఠశాలలో విద్యావిదానం అద్బుతంగా వుందని,తల్లిదండ్రులు కూడా సంతృప్తి వ్యక్తంచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు చింతాడ తిరుమలరావు,విద్యాకమిటీ చైర్మన్ సూర అప్పలనాయుడు,గ్రామసర్పంచి లోలుగు కనకమహలక్ష్మి,శ్రీనువాసురావు,పాఠశాల ఉపాద్యాయులు పాల్గోన్నారు.