శివరాత్రి మహుత్సావాలు
శివరాత్రిని పురస్కరించుకుని పరమశివుని దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు కన్నులుపండుగగానిర్వహిస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాలోని అతిపురాతన దేవాలయంలో అత్యంత కమనీయంగా ఉత్సవాలు జరగుతున్నాయి.శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నాగావళి నదీతీరంలో వెలిసిన ప్రముఖదేవాలయం బలరాండు ప్రతిష్టించి ఉమారుద్రకోటీశ్వరదేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారికేడ్లులో బారులు తీరారు.అదేవిదంగా పట్టణంలో భీమేశ్వరాయలం,ఉమలక్ష్యేశ్వరాదేవాలయం,టెక్కలి మండలం రావివలస శ్రీరాముడు ప్రతిష్టంచి ఎండ మల్లిఖార్జున స్వామివారి దేవాలయంలో అదిక సంఖ్యలో భక్తులు పాల్గోన్నారు.
జలుమూరు మండలం శ్రీముఖలింగంలో శ్రీమధుకేశ్వరాదేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.అంతేకాకుండా బారువా కోటీలింగాలు స్వామివారిని,పాండవులు ప్రతిష్టంచిన మహేంద్రగిరులు లో శివరాత్రి ఉత్సవాలు ఎంతో కన్నులు పండుగగా జరుగుతాయి.