శివాలయాలు దర్శనానికి నియమాలేంటి…?
శివాలయంలో స్దూల,భద్ర,సూక్ష,అనే మూడు లింగాలు వుంటాయి.భక్తులు తప్పనిసరిగా మూడు లింగాలు దర్శించుకోవాలి.ఆలయగోపురం,స్దూలలింగంగా భావించాలి.ద్వజస్తంభం ముందువుండే బలిపీఠం భద్రలింగం.గర్భాలయంలోవుండే లింగం సూక్షలింగం,ఆలయాన్ని సమీపిస్తుంటే ముందుగా గోపురానికి నమస్కరించాలి.ద్వజస్తంభం వద్ద సాఫ్టాంగనమస్కారంచేయాలి.మొదట ఆలయ ప్రదక్షణచేయాలి శివాలయం ద్వజస్తంభం వద్ద తప్ప ఎక్కడా సాష్టాంగ నమస్కారం చేయుకూడదు.నంది అనుమతి పొంది ఆలయంలో ప్రవేశించాలి.వరుసగా వినాయుకునికి,శివునికి,అమ్మవారికి మొక్కాలిఆపై సుబ్రమణ్యం స్వామివారిని దర్శించుకోవాలి.నవగ్రహాలు సన్నిదికి వెళ్లాలి.చివరిగా చండీశ్వరుని దర్శించుకోవాలి.చివరిగా ద్వజస్తంభం వద్ద వచ్చి మళ్లీ సాష్టాంగ నమస్కారం చేయాలి.ఈ విదంగా శివాలయంలో దర్శించుకుంటే మంచి ఫలితాలు వుంటాయి.