శ్రీకాకుళంలో ఒమిక్రాన్ కేసు..?
శ్రీకాకుళం: ఉత్తరాంద్రలోని విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలో అనుమానిత ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.విదేశాలనుండి వచ్చిన ఈ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఒమిక్రాన్ నిర్ధారణకు శాంపిల్సు అదికారులు పంపించారు.పాజిటివ్ వచ్చిన వ్యక్తికి శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో వుంచినట్లు అదికారులు తెలిపారు.ఈ సంఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.ఈ వ్యక్తి ఎవరెవరుతో వున్నారు.అతను వచ్చి ఎన్ని రోజులైంది.తదితర విషయాలు గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు.వైద్యసిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు.శ్రీకాకుళంకి అనుమానిత రావడతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు.