శ్రీమహాలక్ష్మి కి శుక్రువారం అంటే ఎందుకు ఇష్టం
శుక్రువారం శ్రీమహాలక్ష్మి అమ్మవారుకు ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తారు.అసలు శుక్రువారం కి లక్ష్మిదేవికి వున్న సంబందం ఏమిటి ఇపుడు తెలుసుకుందాం.శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువు భార్య,రాక్షసులు గురువైన శుక్రాచార్యులు పేరు మీద శుక్రువారం ఏర్పడిరదని పురాణాలు చెబుతున్నాయి.శుక్రాచార్యులు తండ్రి భృగు మహార్షి,ఈ భృగు మహార్షి బ్రహ్మాదేవుని మానసపుత్రులలో ఒకడు.ఇతడు లక్ష్మిదేవికి తండ్రి కూడా అందుకే లక్ష్మిదేవికి బార్గవి అనే మరో పేరుకూడా వుంది.ఈ విధంగా చూసుకుంటే శుక్రాచార్యుడు లక్ష్మిదేవికి స్వయంగా అన్నదమ్మడు .అందువల్ల శుక్రవారం అంటే శ్రీమహాలక్ష్మికి ఎంతో ఇష్టం
ఈ రోజు అమ్మవారికి పూజలు నిర్వహిస్తే శ్రీలక్ష్మి కటాక్షాం కలుగుతుందని శాస్రం చెబుతుంది.