శ్రీశైల క్షేత్రంలో భక్తులు రద్దీ
శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మాత్సవాలు ను దృష్టిలో వుంచుకుని శ్రీశైలంలో దర్శనాలకు నియమిత సమయం కేటాయించారు.ఈనెల 22వతేదీనుండి మార్చి 4వతేదీ వరకూ స్వామివారి అలంకారణ దర్శనం మాత్రమే వుంటుందని ఆలయం కమిటీ తెలిపారు.శ్రీశైలంలో భారీగా పెరుగుతున్న భక్తులు రద్దీని పురస్కరించుకుని కేవలం శివస్వాములుకు మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనం వుంటుందని దీన్ని భక్తులు తెలుసుకోవాలని అన్నారు.సర్వదర్శనం,విరామదర్శనం,ఆర్జితసేవా ,అలంకారణ సేవకు భక్తులు అనుమతి వుంటుందని తెలిపారు.