శ్రీశైల మల్లన్న దర్శనానకి నేటినుండి ఆన్‌లైన్ టిక్కెట్లు
శ్రీశైలం: కరోనా విజృంభన దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం మల్లన్న దర్శనానికి పూర్తిస్దాయిలో ఆన్‌లైన్ విదానాన్ని అమలు చేస్తున్నామని ఆలయ ఇవో లవన్న తెలిపారు.అన్ని రకాలు దర్శన టిక్కెట్లు నేటినుండి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చామని శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతోపాటు ఆర్జీసేవల టక్కిట్లు కూడా ఆన్‌లైన్‌లో వుంచామని తెలిపారు.మల్ల న్న దర్శనానికి వచ్చేభక్తులందరూ కోవిడ్‌వ్యాక్సిన్ ద్రువీకరణ పత్రం లేదా కోవిడ్ నెగిటివ్ పరిక్ష రిపోర్టు వుండాలని లేదంటే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరగదని ఇది భక్తులు అవగాహన చేసుకుని రావాలని తెలిపారు.