శ్రీశైల మల్లిఖార్జుస్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
శ్రీశైలం: శ్రీశైల బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామివారిని సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి సిజెఎన్‌వి రమణ దంపతులు దర్శించుకున్నారు.ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సిజెరమణ దంపతులకు జిల్లా జడ్జి కృపాసాగర్ ,కర్నూలు కలెక్టరు కోటీశ్వరరావు,దేవాదాయ దర్మాదాయ శాఖ కమీషనర్ హరిజవహర్‌లాల్ ,ఈవో లవన్న అర్చకులు వేదపండితులు ఆలయ మర్యాదులతో స్వాగతం పలికారు.అర్చక స్వాములు సిజెరమణ నుదుట వీభూది తిలకం దిద్ది అదికారులు పూలమాలలతో స్వాగతం పలికారు.అనంతరం ద్వజస్తంబాన్ని దర్శించుకుని స్వామివారిని దర్శించుకున్నారు.