షాపు యజమానులు సహకరించాలి
శ్రీకాకుళం: నగరంలో ట్రాఫిక్ మరియు కాలువలు పేరుకుపోయి పారిశుద్యం సమస్యలు వస్తున్నాయని అందువల్ల రోడ్లు పక్క వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులు కాలువలకు లోపలి వైపు వ్యాపారాలు సాగించాలని అలాచేయుకపోతే చర్యలు తప్పవని నగరపాలకసంస్ద కమీసనర్ చల్లా ఓబులేసు అన్నారు.గురువారం నగరంలో పలు ప్రాంతాలు స్వయంగా పర్యవేక్షించారు.అనంతరం నాగావళి నదివద్ద నిర్మిస్తున్న డైక్ దగ్గర వరదనుండి కాపాడేందుకు 62లక్షలతో నీటిపారుదల శాఖ నిర్మిస్తున్న రింగ్ బండ్ పనులను పరిశీలించారు.