షిర్డీ సాయినాధుని వార్షికోత్సవ ఉత్సవాలు
కలియుగదైవం కోరిన కోరికలు తీర్చే శ్రీశిరీడీ సాయినాదుని ప్రదమ వార్షికోత్సవ ఉత్సవాలు కన్నులు పండుగగా నిర్వహించారు.విజయనగరం జిల్లా వంగర మండలం కేంద్రంలోని వెలిసిన శ్రీషర్డీసాయినాధుని ప్రధమ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించారు.ఈ వార్షికోత్సవ ఉత్సవానికి టీడీపీ పాలట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకట్రావ్,సినీనటుడు శ్రీకాంత్ పాల్గోన్నారు.
ఈ సందర్బంగా స్వామివారికి విశేష అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు.వివిద రకాలు పుష్పాలుతో అలంకరించారు.గంధం ,పాలతో క్షీరాభిషేకాలు జరిపారు.
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి అంటూ భక్తులు నామస్మరణతో ఆ ప్రాంత మంతా పులకించిపోయింది.ఈ కార్యక్రమానికి అశేషభక్తజనం పాల్గోని స్వామివారి సేవలో తరించారు.