సమన్వయంతోనే నేరాలు నియంత్రణ
శ్రీకాకుళం: సమన్వయంతోనే నేరాలు నియంత్రణ అవుతుందని నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఎస్‌పి జి.ఆర్ .రాధిక అన్నారు.జిల్లాలో అన్ని విభాగాలు శాఖలు అదికార్లు సమన్వయంతో పనిచేయుడం జరగుతుందని
,నేరాలు నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ తో ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లాలోని వివిద శాఖలు అదికార్లు పోలీసుసిబ్బందితో అర్ధసంవత్సర నేరసమిక్షాసమావేశం
జరిగింది.ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రతకు ఫేస్‌వాష్,వామనాలు తనిఖీ,ప్రమాద హెచ్చరికలు బోర్డులు,ఏర్పాటు చేసి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నామని అన్నారు.
ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటించడం లేదని అందువల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు.
వర్షాలు కురుస్తు సమయంలో రోడ్లు పై గుంతలు మరమ్మత్తు లు చేయాలని ఆర్‌ఆండ్‌బి అదికార్లుకు సూచించారు.
మహిళా బద్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఇప్పటికే
అదిక సంఖ్యలో దిశయాప్ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
నేరాలు నియంత్రణకు అందరూ కృషిచేయాలని తెలిపారు.అనంతరం పోలీసు అదికార్లుకు ప్రశంశాపత్రాలు అందచేశారు