సమయస్పూర్తితో నేర స్దలంలో ఆధారాలు సేకరించాలి
శ్రీకాకుళం: నేరం జరిగిన వెంటనే దర్యాప్తు అధికారి నేర స్దలానికి చేరుకుని నేర స్దలాన్ని భద్రపరిచి,సమయస్పూర్తితో వివిద కోణాలలో నేర స్దలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే నేరానికి గల కారణాలు కొంత మేర తెలుసుకునే అవకాశం వుంటుంది ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు.తండేంవలస వద్ద గల పోలీస్ శిక్షణా కేంద్రంలో కానిస్టేబుల్‌నుండి సిఐ లు స్దాయి అధికారులు వరకూ క్రైమ్‌కు సంబందించి అన్ని కోణాలలో దర్యాప్తు ఎలా చేయాలని అనే అంశాలు వీడియోచిత్రీకరణ తదితర అంశాలు శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణ అనంతరం ప్రతిభా పత్రాలు సిఐలు నవీన్‌కుమార్,ఈశ్వరప్రసాద్, తిరుపతిరావు
యస్‌ఐలు సురేష్,విజయకుమార్,రాము,ప్రభావతి,ఏఎస్‌ఐలు కు ప్రతిభాపత్రాలు ఎస్పీ అందచేశారు.