సర్వహక్కులు కలిగివుంటారు`స్పీకరు తమ్మినేని
శ్రీకాకుళం: జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకంలో సర్వహక్కులు కలిగివుంటారని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని శీతారాం అన్నారు.మంగళవారం బాపూజీ కళామందిర్‌లో ఏర్పాటుచేసిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.దేశంలో అభివృద్ది సంక్షేమ ముఖ్యమంత్రిగా వున్నారని,ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు ప్రజలు వినియెగించుకోవాలని చెప్పారు.1983నుండి రిజస్ట్రేషన్లు చేయించుకోవలసి వున్నాయన్నారు.లబ్దిదారులు తరుపున ప్రభుత్వమే ఆర్దిక భారం భరిస్తుందని ,తక్కువ ఖర్చుతో రిజస్ట్రేషన్ చేయించుకుని సర్వహక్కులు పొందాలని అన్నారు.