సాయిగాయిత్రి బజాజ్‌లో పల్సర్ పి150 ఆవిష్కరణ
ఆధునిక స్పోర్టీడిజైన్‌తో పాటు శక్తివంతమైన పునరుద్దరించబడిన 150సిసితో ఇంజన్ శక్తి వంతంగా వాహనదారుడు చూడగానే ఆకట్టుకునేవిధంగా తయారుచేసిన పల్సర్ పి150 ఆవిష్కరణ జరిగిందని సాయిగాయిత్రి బజాజ్ షోరూం సేల్సు మేనేజర్ ఎం.విశ్వనాదం ,యమ్ జయరాం అన్నారు.శ్రీకాకుళం పట్టణంలోని పెద్దపాడురోడ్డులో వున్న సాయిగాయిత్రి బజాజ్‌లో సరికొత్త గా తీర్చిదిద్దిన నూతన బజాజ్ పల్సర్ పి 150 శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతన డిజైనులతో స్పోర్టియర్ షార్పర్ గా వుంటుందని దీనిలో నూతన ఏరోడైనిమిక్ 3డిఫ్రంట్ ఉంటుందని అన్నారు.ఆధునిక ట్యాంకు ప్రోఫైల్ సీటు నూతన మోనోసాక్ రియర్సస్పెనన్ అండర్ బెల్లి ఎగ్జాస్ట్ అత్యుత్తమబ్యాలెన్సమరియు హ్యాండ్లింగ్ దీని ప్రత్యేకత అన్నారు.రెండు వేరియంట్లుతో అందచేస్తామని,రెండు డిస్కులు వాహనం ధర 1,19,782షోరూం ధర అందచేయుడం జరుగుతుందని సింగల్ వేరియంట్ ధర 1,16,881 ఎక్సుషోరూంధర నిర్వహించామని తెలిపారు.
రేసింగ్ రెడ్,కరేబియన్ బ్లూ ,ఎబోని బ్లాక్‌బ్లూ అండ్ వైట్ రంగులలో లబిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయిగాయిత్రి బజాజ్ డైరెక్టరు జగదీశ్వరరావు,ఏఎస్‌ఎం గోపాలక్రిష్ణ షోరూం సిబ్బంది పాల్గోన్నారు.