అమరావతి: ఉక్రేయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు సిఎం ఉన్నత స్దాయి సమావేశం ఏర్పాటుచేశారు.కేంద్రవిదేశాంగశాఖామంత్రి జయశంకర్ కు ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు.కేంద్రం అన్ని రకాలు చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి ముఖ్యమంత్రికి వివరించారు.ఉక్రేయిన్ పక్కదేశాలకు ప్రజలును తరలించి అక్కడనుండి ప్రత్యేక విమానాలుద్వారా తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లుచేస్తున్నామని వివరించారు.కలెక్టరు స్దాయిలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి బందువులు కు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అక్కడున్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా విదేశాంగ శాఖాదికార్లుకు అందచేయాలని తెలిపారు.అవసరమైతే ప్రత్యేక విమానాలు ద్వారా తరలింపు లో రాష్ట్రం నుంచి తగిన సహకారం అందించాలని ఆదేశించారు.