సిఎం పర్యటనకు పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు `ఎస్‌పి రాధిక
శ్రీకాకుళం: ఈనెల 19తేదీన జిల్లాకు వస్తున్న రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన దృష్ట్యా పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్‌పి జి.ఆర్.రాధిక తెలిపారు.పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లు ,ట్రాఫిక్ మళ్లింపులు ,హెలిప్యాడ్ ప్రోటోకాల్ ,పబ్లిక్ పార్కింగ్,తదితర అంశాలుపై పోలీసులు అదికారులతో సమిక్షా సమావేశం నిర్వహించారు.ఏ ప్రాంతంలో ఎవరి కేటాయిస్తే ఆప్రాంతంలో విధులు సక్రమంగా నిర్వహించాలని ఎఎస్పీలు డిఎస్పీలు పర్యవేక్షణ జరుపుతారని అన్నారు.సభాస్దలానికి చేరుకునే ప్రజలుకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వారికి సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని ప్రతిఒక్కరూ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని సూచించారు.