సీనియర్ సిటిజన్ కు టిటిడి శుభవార్త
తిరుమల తిరుపతి దేవస్దానంలో స్వామివారిని దర్శించుకునేందుకు సీనియర్ సిటిజన్ లకు వెసులు బాటు కల్పించింది.ఉచిత దర్శనం కోసం రెండు స్టాట్‌లు ఏర్పాటుచేయునున్నారని టిటిడి అదికార్లు తెలిపారు.ఒక స్లాట్ ఉదయం 10గంటలకు రెండువ స్లాట్ 3గంటలకు ఏర్పాటుచేశారు .సీనియర్‌లు ముందుగా ఐడి కార్డులు,వయుస్సు తో కూడిన వివరాలు ఎస్1 కౌంటరులో సమర్పించాలని తెలిపారు.వంతెన క్రిందగ్యాలరీనుండి ఆలయం కుడి వైపు గోడకు రోడ్డు దాటుతుంది.మెట్లు ఎక్కవలసి అవసరం లేకుండా ఏర్పాట్లు చేశారు.లోపల కూర్చున్నప్పుడు వేడి సాంబారు ,మంచి బోజనం ఏర్పాట్లువుంటాయని,పెరుగు అన్నం మరియు వేడిపాలు ఏర్పాటుచేయుడం జరిగిందని అన్నారు.ప్రతిదీ ఉచితంగా అందిస్తామని 20రూ.చెల్లిస్తే రెండు లడ్డూలు పొందవచ్చునన్నారు.మరిన్ని లడ్డూలు కోసం 25రు.చెల్లిస్తే టెంపుల్ ఎగ్జిట్‌గేట్ వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో కౌంటరు వద్దకు డ్రాప్‌చేయుడానికి బ్యాటరీ కారులు అందుబాటులోవుంటాయి.దర్శన సమయంలో ఎటువంటి ఒత్తిడిలేకుండా కేవలం సీనియర్ సిటిజన్ కోసంఅనుమతించబడతాయి.భగవంతుని దర్శనం 30నిముషాలు లో అవుతుందని హెల్పుడెస్కు తిరుమల 08772277777ని సంప్రదించాలని సమాచారం కోసం వివరాలు తెలసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్దానం అదికార్లు తెలిపారు.