సూపర్వైజర్ లీలారాణి తప్పుడు సమాచారం-ఆమదాలవలస సి డి పి ఓ. శ్రీలత ఆగ్రహం

0
1320
telugunews

సరుబుజ్జిలి సెక్టర్ సూపర్వైజర్ లీలారాణి తప్పుడు సమాచారంతో అధికారులను తప్పుదోవ పట్టిస్తోందని, తీరు మార్చుకోవాలని ఆమదాలవలస సి డి పి ఓ. శ్రీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. సరుబుజ్జిలి మండలం చిన్న కాగితపల్లి అంగన్వాడీ కేంద్రంలో పాడైపోయిన సరుకులు ఉన్నాయని సూపర్వైజర్ లీలరాణి. సంబంధించి సీడిపి ఓ సమాచారం ఇచ్చింది. దీనిపై శనివారం చిన్న కాగితాపల్లి అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో స్థానిక నాయకులతో లబ్ధిదారులతో నేరుగా అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఉన్న సరుకులు సంబంధిత శిరిడి సాయిబాబా దేవాలయానికి చెందిన అని, వాటిని తప్పుగా చూపించి అంగన్వాడి కేంద్రం లో ఉన్న సరుకులు గా నమ్మించి కార్యకర్త పై, తప్పుడు సమాచారం ఇచ్చిందని, అటువంటి అధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారని సిడిపిఓ తెలిపారు. అంగన్వాడి కేంద్రం లో సరుకులు ఏ నెల ఆ నెల లబ్ధిదారులకు పంపిణీ జరుగుతుందని, పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఇటువంటి తప్పుడు సమాచారం సమంజసం కాదని సూపర్ వైజర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక నాయకులు , లబ్ధిదారులు కోరుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here