సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో సినీనటుడు సాయిధరమ్ తేజ ఆదిత్యుని శుక్రువారం దర్శించుకున్నారు.ఆలయ ప్రదాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆద్వర్యంలో వేదపండితులు వేదమంత్రాలు తో ప్రత్యేక పూజలు జరిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో నిత్యపూజలు అందుకునేఎకైక దేవాలయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారి దేవాలయ మని ఇటువంటి దేవాలయంలో స్వామివారి ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా వుందన్నారు.సీనీరంగం మరింత అభివృద్ది చెందాలని ప్రేక్షకులు మరింత ఆదరించే మంచి సినిమాలు వస్తున్నాయని ప్రజలు ఆదరించాలని అన్నారు.