సేవలు మరింత విస్తృతం`తమ్మినేని శీతారాం సరుబుజ్జిలి: ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని స్పీకరు తమ్మినేని శీతారాం అన్నారు.బుదవారం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం తెలికిపెంట సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో స్పీకరు పాల్గోన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ అర్హత వుండి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందనవారు వుంటే ఈ కార్యక్రమలో ప్రమోజనం కలుగుతుందని వినియెగించుకోవాలని అన్నారు.11రకాలు సర్టిఫికేట్లు ఉచితంగా అందిస్తున్నామని ఇదివరకూ మండలం కేంద్రం చుట్టూ తిరగేవారని నేడు ఆ సమస్యలు రాకుండా వుందని అన్నారు.
పౌరులందరికీ రక్షణగా రాష్ట్రంలో 2.6లక్షలు మంది వలంటీర్లు 1.5లక్షలు మంది సచివాలయం సిబ్బంది 3వేలు మంది అధికార్లు,15వేలుకు పైగా జగనన్న సురక్ష క్యాంపులు 1.6కోట్లు గృహాలు సర్వేచేస్తున్నామన్నారు.ప్రభత్వం నిబద్దతతో పారదర్శకంగా పరిపాలనసాగుతుందని ఉత్తమ పాలన అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కెవివిజి సత్యన్నారాయణ,మండలపార్టీ అద్యుక్షులు బెవర మల్లేశ్వరరావు,మార్కెట్ కమిటీ అద్యుక్షురాలు బెవర క్రిష్ణవేణి తదితరులు పాల్గోన్నారు.