హామ్‌గార్డులు సేవలు వెలకట్టలేనివి`జిల్లా ఎస్పీ రాధిక
శ్రీకాకుళం: పోలీసువ్యవస్దతోపాటు హామ్‌గార్డులు సేవలు వెలకట్టలేనివని ,నిరంతరం వారి వృత్తి దర్మంలో లీనమై సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఆర్మీరిజర్డు మైదానంలో 60వ హామ్‌గార్డులు ఆవిర్బావ దినోత్సవం లో ఎస్పీ పాల్గోన్నారు. ఈసందర్బంగా వందనస్వీకారం అందుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ సమాజానికి ఎనలేని సేవలు అందించడంలో హామ్‌గార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని ,అందువల్ల వీరికి అన్ని విధాలా ప్రభుత్వం అదుకుంటుందని,నవరత్నాలు భాగంగా ఇండ్లు స్దలాలుకూడా మంజూరు చేసేందుకు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.
యాక్సిడెంట్‌ల్ ఇన్సూరెన్సు 30లక్షలు వర్తింపచేస్తున్నారని ,ఇంకా అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని అందువల్ల వారి కుటుంబాలకు పూర్తి భరోసా కల్పిస్తున్నారని అన్నారు.నిరంతరం ప్రజలుతో మమేకమై మన్ననలుపొందాలని ,పూర్తిస్దాయిలో సేవలు వినియెగిస్తున్నారని అందువల్ల వారి సేవలు మరువలేమని అన్నారు.