హెల్మెట్ ధరించుకో…ప్రాణాలు రక్షించుకో
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని,హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని ట్రాఫిక్ ఎస్‌ఐలు లక్ష్మణరావు,వెంకట్రావ్‌లు అన్నారు.డిఎస్పీ ఆదేశాలు మేరకు ట్రాఫిక్ సిబ్బంది వినూత్నతరహాలులో ఫ్లెక్సీలు వివిద కూడలిలో ఏర్పాటుచేసి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.అందులో భాగంగా శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.మీ కోసం కాకుండా మీ కుటుంబం కోసం కూడా ఆలోచించి వాహనాలునడపాలని ట్రాఫిక్ నిబందనలు తూ,చ తప్పకుండా పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సబ్బందికి కూడా సహకరించాలని అన్నారు.
ఈ తరహా ఫ్లెక్సీలు పట్టణంలోని వివిదకూడలిలు వద్ద ఏర్పాటుచేయుడం జరుగుతుందని అన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్‌లు తోపాటు ట్రాఫిక్ సబ్బంది పాల్గోన్నారు.