హెల్మెట్‌ వాడకం తప్పనిసరి

0
106
telugu news

హెల్మెట్‌ వాడకం తప్పనిసరి
శ్రీకాకుళం: వాహనదారులు హెల్మెట్‌ వాడకం తప్పనిసరిగా చేయాలని ,ప్రమాదాల సమయంలో తలకి దెబ్బతగలకుండా ప్రాణాపాయంనుండి మనల్ని రక్షించేది ఒక్క హెల్మెట్‌ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ లక్ష్మణరావు అన్నారు.గురువారం పొందూరులో వాహనదారులకు ట్రాఫిక్‌ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ .వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని,ట్రాఫిక్‌ నిబందనలు పాటించాలని అన్నారు.ప్రతిఒక్కరూ తప్పని సరిగా వాహనం నడిపేటపుడు హెల్మెట్‌ వాడకం తప్పనిసరిచేయాలని తెలిపారు.ప్రతిఒక్కరూ వాహనానికి అనుమతులు ,డ్రైవింగ్‌ లైసెన్సులు కలిగివుండాలని .జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్బంగా పలు వాహనాలు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలులో పోలీసు సిబ్బంది పాల్గోన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here