ఆముదాలవలస ప్రాజెక్టు లో రసాభాస..అపరిచితి వ్యక్తులు హల్‌చల్
శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రాజెక్టు పరిదిలోని సరుబుజ్జిలి సెక్టారు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు సెక్టారుమీటింగ్ లో రసాభాసగా మారింది.గత రెండు నెలలు క్రింద సరుబుజ్జిలి సెక్టారు లో లీలారాణి సూపర్‌వైజర్ గా విధులుకు జాయిన్ అయ్యింది.గతంలో రణస్దలంలో సస్పెండ్ అయినా ఇక్కడ కూడా అదే తరహాలో తన బాణీ కొనసాగుతుంది.కార్యకర్తలకు అసభ్యకరమైన పదజాలంలో మాట్లాడడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదు.కొంతమంది అపరిచిత వ్యక్తులను కూడా ప్రాజెక్టుపరిదిలోకి సూపర్‌వైజర్ రప్పించి,కార్యకర్తలకు సమాచారం ఇమ్మని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది.తన భర్త పెద్ద రియల్‌ఎస్టేట్ అని నన్ను ఎవరూ ఏమిచేయులేరని ,డబ్బులు నా భర్త విరజిల్లి విలేకర్లుతో వార్తలు రాయించగల సత్తా వుందని ,జిల్లా అదికార్లు అయినా ,ప్రాజెక్టు అదికారి అయినా నన్నుఏమిచేయులేరని ఉత్తర పలుకులు పలుకుతుంది.ప్రశాంతంగావున్న ప్రాజెక్టు ఈ సూపర్‌వైజర్ రాకతో గజిబిజిగామారింది.కార్యకర్తలుకు ,సూపర్‌వైజర్ ఎటువంటి సమన్వయం లేకపోవడంతో తప్పుడు సమాచారం కార్యకర్తలుపై ఇస్తూ కార్యకర్తలును ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తుంది.ఇటువంటి సూపర్‌వైజర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఈ సూపర్‌వైజర్ పై దర్యాప్తు చేయువలసిన అవసరం ఎంతైనావుంది.