వైయస్సా ఆర్‌పార్టీలో పలువురు చేరిక
శ్రీకాకుళం: వైయస్ ఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పధకాలు యువత ఆకర్షిత లవుతున్నారని ప్రస్తుత సమాజం యువత శక్తితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి దర్మాన పాల్గోన్నారు.ఈ సందర్బంగా యువనాయుకుడు బరాటం సంతోష్‌ను పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.సంతోష్‌పాటు మరికొంతమంది యువనాయుకులు పార్టీలో చేరారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు యువత నిర్ణయంతోనే ఆదారపడివుందని అందువల్ల యువత ఆలోచించి ఓటు వేయాలని సంక్షమ పధకాలు అమలుచేయుడంలో రాష్ట్రప్రభుత్వం దేశంలోనే ముందుందని దీన్ని యువత గుర్తించాలని అన్నారు.సంతోష్ లా అందరూ ఆలోచింది పార్టీని ఎన్నుకునే విదంగా ముందుకు కదలాలని అన్నారు.రాబోయే ఎన్నికలలో మళ్లీ వైయస్సాఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని అన్నారు.బరాటం సంతోష్ మాట్లాడుతూ అన్నివర్గాలు వారికి ,సమన్యాయంగా పాలన సాగుతుందని దీన్ని ఆకర్షితులై నేడు యువత పెద్దఎత్తున వైయస్సాఆర్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు.
మంత్రి దర్మాన ప్రసాదరావు సారధ్యంలో పార్టీలో చేరడం చాలా ఆనందకరంగా వుందని ,పార్టీకోసం పనిచేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో యువనాయుకుడు ధర్మాన రాంమనోహర్‌నాయుడు,మామిడి శ్రీకాంత్,అంధవరపు సూరిబాబు పలువురు పాల్గోన్నారు.