తొలికిరణ స్పర్శ
శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారి దేవాలయంలో తొలికిరణ స్పర్శ దర్శనం జరిగింది.ఉత్తరాయణం పురస్కరించుకుని మార్చి,అక్టోబరు లో ఈ తొలికిరణ స్పర్శ జరుగుతుంది.ఉషా,పద్మిణీ సమేత శ్రీ సూర్యనారాయణస్వామివారికి ఈ కిరణ స్పర్శ జరగడంతో స్వామివారు బంగారు రంగు వర్ణంలో భక్తులుకు దర్శనం ఇచ్చారు.ముందుగా తొలి కిరణం గాలిగోపురంనుండి అనివెట్టి మండం పై పడి స్వామివారి పాదాలుపై ఈ కిరణస్పర్శ జరిగింది.ఆరోగ్యప్రదానస్వామివారి కిరణస్పర్శఎవరుదర్శించుకంటే వారికి సంపూర్ణఆరోగ్యం కలుగుతుంది ప్రదాన అర్చకలు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వాహణాదికారి హరి సూర్యప్రకాశరావుతదితరులుపాల్గోన్నారు.