0
61
telugu news

డ్రగ్స్‌ రహిత ఆంద్రప్రదేశ్‌గా మారాలి`ఎస్సై లక్ష్మణరావు
శ్రీకాకుళం: ప్రస్తుత సమాజంలో పెద్ద ఎత్తున యువత పెడతోవ పడుతుందని దానికి కారణం డ్రగ్స్‌ మాదక ద్రవ్యాలు కారణమని శ్రీకాకుళం రెండువ పట్టణ ఎస్సై లక్ష్మణరావు అన్నారు.డ్రగ్సు రహిత ఆంద్రప్రదేశ్‌ దిశగా అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ జిఆర్‌ రాధిక ఆదేశాలు మేరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత ముందు అవగాహనకల్పించేందుకు అందరూ కృషిచేయాలని ,యువత డ్రగ్సు మాదక ద్రవ్యాలు వల్ల కలిగే నష్టాలు ముందు తెలుసుకోవాలని అన్నారు.ఈ సమయంలోనే యువత అప్రమత్తంగా వుండాలని లేదంటే జీవితం నాశమవుతుందని అన్నారు.ఇపుడు మీరే వేసే ప్రతి అడుగు మీ జీవితం పైఆదారపడుతుందని చాలా జాగ్రత్తగా వుండాలని మాదక ద్రవ్యాలు వైపు దృష్టి లేకుండా ఏకాగ్రత కలిగివుండాలని అన్నారు.ఈ సమయంలోనే మీ మనస్సు అచంచలంగా వుంటుందని దాన్ని కంట్రోల్‌ చేసుకుని జీవితం సుఖమయంగా సాగేవిదంగా ఆలోచించాలని అన్నారు.యువతీ యువకులు పూర్తి అవగాహన కల్గి వుండాలని ,డ్రగ్సు రహిత ఆంద్రప్రదేశ్‌గా ఆడుగులు వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్దం చేశారని అందులో భాగంగా ముందు యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు,ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ డిగ్రీ విద్యార్దులకు పూర్తి స్దాయి అవగాహన కల్పిస్తున్నామని,యువత చాలా జాగ్రత్త గా మత్తు పదార్దాలు జోలికి పోకుండా వాటికి బానిసలు కాకుండా చూసుకోవాలని,వాటి వల్ల కలిగే నష్టాలు పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమలో విద్యార్దులు అదిక సంఖ్యలో పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here