32 ఎమ్యేల్యే డౌట్…?
అమరావతి: ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఎమ్యేల్యే పనితీరుపై సమిక్ష నిర్వహించారు.అందులో 32మంది ఎమ్యేల్యేలు పనితీరు బాగోలేదని వారు తీరు మార్చుకోకపోతే మార్చిలో వారి స్దానంలో కొత్తవారు వస్తారని సంకేతాలు అందించారని తెలుస్తుంది.పలువురు ,ఎమ్యేల్యే మంత్రులుకు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అందులో మంత్రి అప్పలరాజు,రజని,అమర్నాద్,బొత్స,అంబటి,.జయరాంలు పై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని సమాచారం. ఎమ్మేల్యే మద్దిశెట్టి,ఎమ్మోల్సీ ఇక్బాల్ పనితీరు కూడా బాగోలేదని తెలిపారు.మార్చినాటికి గడపగడపకు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని గృహసారధులు నియామకంపూర్తి చేయాలని తెలిపారు.మార్చిలో మరోకసారి సమిక్ష వుంటుందని అందులో మార్పు చేర్పులు జరుగుతాయని సంకేతాలు ఇచ్చారు.