55నిమిషాలు తితిదే దర్శన టిక్కెట్లు బుకింగ్ రికార్డు
తిరుమల: శ్రీవారి దర్శనానకి భక్తులు నుండి అనూహ్య స్పందన వచ్చింది.జనవరి నెలలో ఆన్‌లైన్‌కు సంబందించి నాలుగు లక్షలు 60వేలు టిక్కెట్లును తిరుమల తిరుపతి దేవస్దానం విడుదల చేసింది.టిక్కెట్లు విడుదల చేసిన 55నిముషాలలోనే టిక్కెట్లు బుక్ అయిపోయాయి.భక్తులునుండి లక్షలాది హిట్లు రావడంతో టిక్కెట్లు కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైంది.టిక్కెట్లు విక్రయం పూర్తియిన విషయం తెలీక భక్తులు టిటీడీ వెబ్ సైట్‌కు లాగిన్ అవుతూనే వున్నారు.