విశాఖ :అరకులోయ మండలం పద్మాపురం జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా లారీ లో తరలిస్తున్న 680 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న అరకులోయ పోలీసులు.విలేకరుల సమావేశంలో అరకులోయ సి.ఐ జి.డి బాబు మాట్లాడుతూ,ఒడిషా లోని పాడువా నుంచి జార్ఖండ్ కు లారీ లో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని,నలుగురు నిందితులలో ఒకరు పరారీ అయ్యాడని,ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.ముగ్గురి లో ఒకరు ఒడిషా గొల్లూరి గ్రామ సర్పంచ్ ఉన్నారన్నారు.ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందన్నారు.పుష్ప సినీమా తరహాలో లారిపై ప్రత్యేక కాబిన్ ఏర్పాటు చేశారని,లారీ యజమాని తప్పించుకున్నారని సిఐ తెలిపారు.తప్పించుకున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన పంకజ్ గిరిజన యువతను ప్రలోభాలకు గురి చేస్తున్నారని,తనని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.